అవ్వా తాతలు, వితంతువులు, వికలాంగులకు రూ 3 వేలు పెన్షన్ ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్టం ఆంధ్రప్రదేశ్ అని, ఈ ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పండుగ వాతావరణంలో జరిగిన రైల్వే కోడూరు మండల పెన్షన్ల పెంపు మరియు నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి మాట నిలబెట్టుకున్నారన్నారు. రైల్వే కోడూరు మండలంలోనే సుమారు 11 వేలుకు పైగా పెన్షన్లు పంపిణీ అవుతున్నాయన్నారు. నెలకు పెన్షన్ల క్రింద రైల్వే కోడూరు మండల పరిధిలో రూ.10 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో కొత్త పెన్షన్ మంజూరు కావాలంటే ఎవరైనా చనిపోతేనే వచ్చేదన్నారు. జగన్ పాలనలో అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ పింఛన్లు అందుతున్నాయన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాను పల్లెలకు వెళ్లినప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో చట్టబద్దత లేని జన్మభూమి కమిటీలు రాజ్యమేలాయన్నారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు బేరీజు వేసుకుని ప్రజలు వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. అధికారమే పరమావధిగా చంద్రబాబు కుళ్ళు కుతంత్రాలతో, దుష్టచతుష్టయం తో పావులు కదుపుతున్నారన్నారు. పెన్షన్ లబ్ధిదారులకు నూతన సంవత్సర మరియు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ తో పాటు స్వీట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, ఏపీ టూరిజం డైరెక్టర్లు వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి, మందల నాగేంద్ర, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ సుబ్బరామరాజు, ఉప సర్పంచ్ తోట శివ సాయి, పట్టణ కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు.
అతని పాలనలో అర్హతే ప్రామాణికంగా పింఛన్లు…
76
previous post