అవ్వా తాతలు, వితంతువులు, వికలాంగులకు రూ 3 వేలు పెన్షన్ ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్టం ఆంధ్రప్రదేశ్ అని, ఈ ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పండుగ వాతావరణంలో జరిగిన రైల్వే కోడూరు మండల పెన్షన్ల పెంపు మరియు నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి మాట నిలబెట్టుకున్నారన్నారు. రైల్వే కోడూరు మండలంలోనే సుమారు 11 వేలుకు పైగా పెన్షన్లు పంపిణీ అవుతున్నాయన్నారు. నెలకు పెన్షన్ల క్రింద రైల్వే కోడూరు మండల పరిధిలో రూ.10 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో కొత్త పెన్షన్ మంజూరు కావాలంటే ఎవరైనా చనిపోతేనే వచ్చేదన్నారు. జగన్ పాలనలో అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ పింఛన్లు అందుతున్నాయన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాను పల్లెలకు వెళ్లినప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో చట్టబద్దత లేని జన్మభూమి కమిటీలు రాజ్యమేలాయన్నారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు బేరీజు వేసుకుని ప్రజలు వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. అధికారమే పరమావధిగా చంద్రబాబు కుళ్ళు కుతంత్రాలతో, దుష్టచతుష్టయం తో పావులు కదుపుతున్నారన్నారు. పెన్షన్ లబ్ధిదారులకు నూతన సంవత్సర మరియు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ తో పాటు స్వీట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, ఏపీ టూరిజం డైరెక్టర్లు వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి, మందల నాగేంద్ర, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ సుబ్బరామరాజు, ఉప సర్పంచ్ తోట శివ సాయి, పట్టణ కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు.
CM YS Jagan
తిరుపతి, టిటిడి కేటాయిస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోను వ్యతిరేకిస్తున్న విపక్షాలు. పట్టా పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటారని ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. మహతి ఆడిటోరియం లో పట్టా పంపిణీ కార్యక్రమంలో భారీ పోలీసు బందోబస్తు. తిరుపతిలో టిడిపి, జనసేన, సిపిఎం నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. టిటిడి ఉద్యోగస్తులకు పట్టాల పంపిణీని స్వాగతిస్తున్నాం అని, కానీ పట్టాలపై ఓపక్క వెంకటేశ్వర స్వామి ఫోటో, మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు టిడిపి సీనియర్ నాయకులు వూకా విజయ కుమార్. టిడిపి నాయకులను జనసేన నాయకులను హౌస్ అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు ఇంటి పట్టాలపై వేసిన ఫోటోలు రేపు సేవా టికెట్లపై అలాగే టిటిడి సంబంధించిన వెబ్సైట్లో కూడా జగన్ ఫోటో పెడతారా అంటూ టిటిడిఈఓ ధర్మారెడ్డిని, చైర్మన్ కరుణాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ద్వారా గాని టీటీడీ నిధులు తో గాని ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. టిటిడి ఉద్యోగస్తులు వారి సొంత డబ్బుతో కొనుక్కుంటున్న జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. కేవలం కరుణాకర్ రెడ్డి తన కొడుకు అభినయ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని,ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి కూడా వీలు లేకుండా పోలీసులతో హౌస్ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచిది కాదని త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు అందిస్తున్న ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్ పై ఒకవైపున టిటిడి ఎంబ్లం తో కూడిన వెంకటేశ్వర స్వామి బొమ్మ, మరోవైపున జగన్మోహన్ రెడ్డి బొమ్మను పెట్టి ప్రొసీడింగ్స్ ఇవ్వడం అభ్యంతరకరమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ లోను రాజకీయ పార్టీ నేతల బొమ్మలను ప్రచురించడం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రచార ఖండూతికి ఇది పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. ఇప్పటివరకు సైన్ బోర్డులు, వైఎస్ఆర్ కిట్లు, జగనన్న విద్యా దీవెన, జగనన్న పథకాలకు తన ఫోటోను తగిలించి సంబరపడిపోతున్న ముఖ్యమంత్రి ఆఖరుకు తిరుమల వెంకటేశ్వర స్వామి తో సమానంగా తన ఫోటోను ముద్రించి ఇవ్వడం భక్తుల మనోభావాలతో చెలగాట మాడటమేనని ఆయన అన్నారు. తక్షణం ప్రొసీడింగ్స్ పై ఫోటోలను తీసి వేయాలని టిటిడి యాజమాన్యానికి ఆయన సూచించారు. కందారపు మురళి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి.
నేడు కడప జిల్లా రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినున్న ముఖ్యమంత్రి. ఈరోజు ఉదయం 10:30కు కడపకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బద్వేల్ నియోజకవర్గం లోని గోపవరం మండలంలో సెంచరీ ప్లైవుడ్ ఇండస్ట్రీని ప్రారంభించి. హై పవర్ లామినేషన్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్న సీఎం. అనంతరం12 గంటల 45 నిమిషాలకు కడప రిమ్స్ ఆసుపత్రికి చేరుకొని సుమారు 300 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రి, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రులతోపాటు… వైయస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం ప్రారంభం. మధ్యాహ్నం అంబేద్కర్ జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ పనులను, కోటిరెడ్డి సర్కిల్లో విగ్రహాలు ఆవిష్కరణ. మున్సిపల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ హాకీ కోర్టుకు శిలాఫలకం వేసి అనంతరం ఇడుపుల పాయ చేరుకొని అక్కడే రాత్రి బస చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
అమరావతి, ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యాదీవెన,జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పధకాల నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్. విదేశీ విద్యా దీవెన కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్లు విడుదల. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించిన 95 మందికి,తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా కోటి రూపాయలు విడుదల. మొత్తం 42.60 కోట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్..
నేడు శ్రీకాకుళం జిల్లాలో ని ఉద్దానం ప్రాంతంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. విశాఖ నుండి హెలికాప్టర్ ద్వారా కంచిలి మండలం మఖరాంపురం చేరుకుని. ఉద్దానం కిడ్నీ వ్యాధులు చెక్ పెట్టేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా 700 కోట్ల రూపాయిలతో నిర్మించిన డాక్టర్. వై. ఎస్. ఆర్ సుజల ధార ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ ని ప్రారంభించనున్న సిఎం. అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా పలాస చేరుకోనున్న ముఖ్యమంత్రి. పలాస లో 74.24 కోట్లతో నిర్మించిన వైస్ఆర్ కిడ్నీ రిసెర్చ్ సెంటర్ ను ప్రారంభించనున్న సిఏం జగన్. వీటితో పాటు పలాస ఇండస్ట్రీయల్ పార్క్, ఆంద్రాయూనివర్శిటి అనుభంద విభాగానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి. అనంతరం రోడ్ షో ద్వారా పలాస రైల్వే గ్రౌండ్ చేరుకుని బహిరంగ సభలో పాల్గోనున్న సిఏం.
పొలాలు, కాల్వలు కలిసిపోయాయి, బంగాళదుంపకి …ఉల్లిపాయకి తేడా తెలియని సీఎం ఎన్నుకున్నాం. సాగు నీటి కాలవ, మురుగు కాల్వ కి తేడా తెలియని ముఖ్యమంత్రి ఉన్నారు. పంటలు నష్టపోతే బీమా నగదు ఇవ్వాలి. 16 మంది రైతులకు మాత్రమే భీమా కట్టారు. ఎకరా మిరప సాగుకు 1.50లక్షలు ఖర్చు అవుతుంది. హుద్ హుద్ తుఫాన్ కు ముందు చేరుకుని బసులోనే ఉన్న. అక్కడ సమస్యలు పరిష్కరించి వచ్చా. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తుఫాన్ ప్రభావం చూపింది. రెండు రోజులు తాను ఆగాను. తాను బాపట్లకు కార్యక్రమం ప్రకటించాక సీఎం నాటకంగా బయలుదేరారు. రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం… వదిలేసింద. పర్చూరులో వైకాపా కార్యకర్త పంట నష్టానికి రూ. 2 లక్షలు ఇచ్చాను. మంచికి…చెడుకు కులం, మతం లేదు. ఇప్పటికి నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కి బాధ్యత ఉందా లేదా…? బాపట్ల లో సీఎం కి ఒక వేదిక వేసి…మ్యాట్లు వేసి పొలం చూసేందుకు వచ్చారు.
పొలం గురించి తెలియని వ్యక్తికి పంటల గురించి ఏమి తెలుస్తుంది. ఈ ప్రభుత్వం వలన లక్షల్లో రైతులు అప్పుల పాలయ్యారు. రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి సీఎం కి మనసు రాలేదు. పంట నష్టం గురించి కేంద్రాన్ని కూడా సీఎం జగన్ అడిగే పరిస్థితి లేడు. నాలుగు రోజులైనా ఏ పంటలు..ఎంత నష్ట పోయారో చెప్పే ధైర్యం చెప్పలేదు. ఎంత పంట నష్ట పరిహారం ఇస్తానో కూడా సీఎం జగన్ చెప్పలేదు. రైతులు గట్టిగా అడిగితే కేసులు పెడతారు. రైతు కష్టంలో వున్నప్పుడు దుర్మాగమైన పరిస్థితి తెచ్చారు. పంటలకు భీమా చేసి ఉంటే నష్టం పరిహారం ఇచ్చే అవకాశం ఉండేది. తాను ప్రస్తుతం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న. రైతుకు ధైర్యం చెప్పేందుకు వచ్చా అని వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ చేయకఊతే 3 నెలలో వైకాపాను బంగాళాఖాతంలో కలుపుదాం. ముఖ్యమంత్రికి అల్టిమేట్ ఇస్తున్న. పంటల నష్టం పై కేంద్రానికి కూడా లేఖ రాస్తాను. రాష్టంలో ఎంత పంట నష్టపోయారో ఆన్ లైన్ లో ఉంచాలి. నష్ట పరిహారం వైకాపా దొంగలకు ఇస్తే.. సంగతి తెలుస్తాం. నిజమైన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి. రైతు ద్రోహి జగన్ మోహన్ రెడ్డి.
విజయవాడ దుర్గగుడికి చేరుకున్న సీఎం జగన్. పూర్ణకుంభం స్వాగతం పలికిన వేద పండితులు,ఆలయ అధికారులు,ప్రజాప్రతినిధులు.
అలయప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన సీఎం జగన్. 216 కోట్లతో చేపడుతున్న పలు అబ్బివృద్ది పనులకు సీఎం శంఖుస్థాపన.
70 కోట్ల ప్రభుత్వ నిధులు,131 కోట్ల ఆలయ నిధులు,5 కోట్ల దాతల నిధులు,33 కోట్ల ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు. ప్రసాదం పోటు,అన్నప్రసాద భవనం,ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్,కేశఖండన శాల నిర్మాణాలు.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో రేవంత్ చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గురువారం మధ్యాహ్నం జరగనున్న ప్రమాణస్వీకారానికి రావాలని ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు చంద్రబాబునాయుడుకి, కెసిఆర్ ను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించారు. వీరితోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకూ టీపీసీసీ ఆహ్వానం పంపింది. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యతో పాటు వివిధ కుల సంఘాల నేతలు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.