విలువైన భూమిని పేద ప్రజలకు పంచిపెట్టిన…

Valuable land was distributed to poor people

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా&comma; తాడిపత్రి పట్టణ సమీపంలో నివాసానికి యోగ్యంగా ఉన్న అత్యంత విలువైన &lpar;రూ&period;5 కోట్లు&rpar; సొంత భూమిని వైసీసీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఫయాజ్ భాష పేదలకు పంచిపెట్టాడు&period; శనివారం నిర్వహించిన ఈ శుభ కార్యాన్ని వైసీపీ జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి&comma; స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతుల మీదుగా లబ్దిదారుల కు అందించారు&period; ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ ఏ మాత్రం స్వార్ధం లేకుండా సొంత నిధులతో 232 మందికి 1&period;25 సెంట్ల చొప్పున స్థలాలు ఇవ్వడం చాల గొప్ప విషయం అన్నారు&period; ఫయాజ్ భాష సల్లంగుండేలా ప్రతి రోజు ప్రార్ధనలు నిర్వహించాలని హజరైన ముస్లిం సోదర సోదరీ మణులను కోరారు&period; అనంతరం ఫయాజ్ భాష మాట్లాడుతూ తానేదో ఆశించి ఈ కార్యక్రమం నిర్వహించడం లేదని వివరించాడు&period; ఫయాజ్ బాషా ట్రస్టు ద్వారా తాను చేస్తున్న&&num;8221&semi; సేవాకార్యక్రమాలు స్థానిక ప్రజలకు తెలియంది కాదన్నారు&period; సేవా కార్యక్రమాల్లో భాగంగానే స్థలం లేని పేదవారికి ఇళ్ల పట్టాలను అందిస్తున్నానన్నారు&period; అవకాశం కల్పించిన అల్లాకు రుణపడి ఉంటానని తెలిపారు&period; వైసీపీ పార్టీతోనే మైనార్టీల అభివృద్ధి సాధ్య పడుతుందని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఫయాజ్ భాష అన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చంద్రబాబు ప్రభుత్వంలో ముస్లిం మేతరుడు పల్లె రఘునాథరెడ్డికి వక్ఫ్ బోర్డు మినిస్టర్ గా పదవి ఇచ్చి ముస్లిం మైనార్టీలను అగౌరపరచాడన్నారు&period; ముస్లిం మైనార్టీల సమస్యలు ఆయనకు వద్ద చెప్పుకోలేక మత పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడిన సంఘటనలు ఉన్నాయన్నారు&period; రెండు సంవత్సరాల తరువాత చంద్రబాబే ఆ పదవి తన వద్ద ఉంచుకున్నాడన్నారు&period; ఆయన అపాయింటమెంట్ దొరకక మరో రకంగా ముస్లిం మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారని ఆవేదన చెందారు&period; అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముస్లిం మైనార్టీ నాయకుడు అంజాద్ ఖాన్ ను ఉప ముఖ్యమంత్రిగా చేసి మైనార్టీల అభివృద్ధికి పాటు పడ్డాడన్నారు&period; దేశంలోనే పార్టీలకు&comma; మతాలకు అతీతంగా పారదర్శకంగా సంక్షేమాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు&period; మైనార్టీలంతా ఏ పార్టీలో తమకు మంచి జరిగిందో ఆలోచించుకోవాలన్నారు&period; మైనార్టీలకు సముచిత స్థానం కల్పించిన వైసీపీ కా&comma; అగౌరపరచిన టీడీపీ పార్టీకా అన్నది గుర్తుంచుకోవాలంటూ సమావేశాన్ని ముగించారు&period; ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య&comma; రాష్ట్ర మహిళా కార్యదర్శి పేరం స్వర్ణలతా రెడ్డి&comma; రమేష్ రెడ్డి&comma; అనంతపురం పార్లమెంటరీ అభ్యర్థి శంకరనారాయణ&comma; తదితర వైసీపీ నాయకులు&comma; కార్యకర్తలు&comma; ఇళ్ల పట్టాల లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..