రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మజీ సీఎం, ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ తొలిసారి ప్రజలను కలిశారు. చింతమడక గ్రామానికి చెందిన ప్రజలు ఆయనను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి బయటకు రాలేదు. బయట కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. మరోవైపు, ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లారు. దాదాపు 540 మంది గ్రామస్తులు 9 బస్సులు, 10 కార్లలో ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే, వీరిని పోలీసులు చెక్ పోస్ట్ వద్దే ఆపేశారు. అనుమతి ఉంటేనే లోపలకు అనుమతిస్తామని వారికి స్పష్టం చేశారు. దాదాపు 2 గంటల సేపు వేచి ఉన్న తర్వాత వారికి ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు అనుమతి వచ్చింది. అనంతరం కేసీఆర్ తో చింతమడక గ్రామస్తులు మాట్లాడి వెనుదిరిగారు.
ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ
58
previous post