సూర్యోదయానికి ముందే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇంటి వద్దె పింఛన్ అందజేసే వాలంటీర్ వ్యవస్థ (Volunteer system) పై ప్రతిపక్షాలకు కక్ష తగదని వైసీపీ నాయకులు అన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి వైసీపీ కార్యాలయంలో స్థానిక వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాచేపల్లి నగర పంచాయతీ మాజీ మున్సిపల్ చైర్మన్ మునగా రమాదేవి పున్నారావు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే సచివాలయ వాలంటీర్ వ్యవస్థలను ఇబ్బందులకు గురి చేస్తే అది ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయడమే అన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి జనాదరణ పెరుగుతుందనే ఉద్దేశంతో కోర్టులో పిటిషన్ వేసి వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి అడ్డుపడుతున్న ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. రాబోయే ఎలక్షన్ లో అవ్వ తాతలు చంద్రబాబుకి బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు.
ఇది చదవండి: నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఉద్రిక్తత…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి