Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఉద్రిక్తత…

నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఉద్రిక్తత…

by Rama
Shivananda reddy

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత, మాజీ ఐపీఎస్‌ అధికారి శివానంద రెడ్డి ఇంటికి వెళ్లారు తెలంగాణ పోలీసులు.. భూ వివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు సీసీఎస్‌ పోలీసులు వెళ్లినట్టుగా తెలుస్తుండగా.. అయితే, మొదట నోటీసు ఇవ్వాలని కోరారట శివానందరెడ్డి.. ఇక, తెలంగాణ పోలీసులు నోటీసు తయారు చేస్తుండగానే.. వేగంగా కారు ఎక్కి వెళ్లిపోయారు శివానంద రెడ్డి.. అడ్డుకునే ప్రయత్నం హైదరాబాద్‌ పోలీసులు చేయగా.. దొరకకుండా తప్పించుకొని వెళ్లిపోయారట శివానంద రెడ్డి.. ఇదే సమయంలో.. తెలంగాణ పోలీసులు.. శివానంద రెడ్డి వాహనాలు వెంబడించకుండా ఆయన అనుచరులు గేట్లు వేసినట్టుగా తెలుస్తోంది.

కాగా, హైదరాబాద్‌లో ఓ భూవివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు అల్లూరు వెళ్లారట సీసీఎస్ పోలీసులు.. ఈ విషయం బయటకు పొక్కడంతో పెద్ద ఎత్తున శివానందరెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు టీడీపీ శ్రేణులు.. కాగా, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు మాండ్ర శివానందరెడ్డి.. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటూ వస్తున్నారు.. ఈ తరుణంలో అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధం కావడం.. ఆయన తప్పించుకుని పారీపోవడం చర్చగా మారింది. మరి ఈ కేసులో పోలీసులు తర్వాత ఎలాంటి స్టెప్‌ తీసుకుంటారు అనేది చర్చగా మారింది. అయితే, హైదరాబాద్ లో భువివాదంలో క్రైమ్ నెంబర్ 194/2022లో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు సీసీఎస్ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినట్టుగా సమాచారం.

ఇది చదవండి: గాయత్రి పంపు హౌస్ నుండి వరద కాలువకు నీరు విడుదల..


అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. …
పవన్ కళ్యాణ్‌పై జడ శ్రవణ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో రాజకీయ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. జనసేన పార్టీ నాయకులు …
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంగవైకల్య యువతి సుంకోజు శివాని సామాజిక సేవపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039099
Total views : 194283

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: