ఫ్లై ఓవర్ మాకొద్దు అండర్ బ్రిడ్జి కావాలి..

Bridge Rally

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామం లో రైల్వే గేటు వున్నది&comma; దాచేపల్లి నుండి వినుకొండ ప్రధాన రహదారి అవ్వడం వలన నిత్యం ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది&comma; ఈ గేటు నుండి నిత్యం కొన్ని వేల వాహనాలు వెళ్తు ఉంటాయి&period; అయితే ఈ గేటు వలన వాహన దారులు ప్రతి రోజు ఇబ్బంది పడటం వలన ప్రభుత్వం ఫ్లై ఓవర్ నిర్మాణం చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది&comma; భూసేకరణ పనులు మొదలు పెడుతున్నారని తెలిసి కేసానుపల్లి గ్రామ ప్రజలు ఆందోళనకి దిగారు&period; గత 50 సంవత్సరాల నుండి ఈ గ్రామంలోనే నివసిస్తూ జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే కొన్ని వందల కుటుంబాలు ఇల్లు కోల్పోయి రోడ్డున పడతయాని వారు ఆవేదన వ్యక్తం చేశారు&period; రెక్క ఆడితే గాని డొక్కాడని బతుకులు మావి&comma; మేము ఇల్లు కోల్పోతే ఎక్కడ ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు&period; అయితే ఫ్లైఓవర్ నిర్మాణం కాకుండా అండర్ బ్రిడ్జ్ వేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు&period; తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం లేదంటే ఆత్మహత్యలకు సిద్ధమంటున్న కేసానుపల్లి గ్రామస్తులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..