64
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జోన్నవాడ గ్రామం నందు కొత్తగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామానికి చెందిన మహిళలతో ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక మహిళలు ఇంటి స్థలం మంజూరు చేయాలంటూ కోవూరు ఎమ్మెల్యేని ఆశ్రయించిగా ఆయన ఆగ్రహంతో మీరు అంతా టీడీపీ వారు పంపిస్తే వచ్చారా అని మండిపడ్డారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. తాము ఏ పార్టీకి చెందిన వారము కాదని ఇళ్ల స్థలం కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే తమపై విరుచుకుపడడం ఏమిటని బాధపడ్డారు.