ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల 23వ తేదీ మంగళవారం ఇచ్చాపురంలో పర్యటించనున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు ఇచ్చాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్ షర్మిల పర్యటన వివరాలు వెల్లడించారు. ఉదయం 10:30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర విజయ స్థూపం వద్ద వైయస్సార్ కు నివాళులర్పిస్తారన్నారు. అనంతరం ఆర్జె ఫంక్షన్ హాల్ లో పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారని తెలిపారు. అక్కడ నుండి నేరుగా విజయనగరానికి బయలుదేరుతారని ఆయన తెలిపారు. వైయస్ షర్మిల రాక సందర్భంగా ఇచ్చాపురం పట్టణంలో వైయస్సార్ పాదయాత్ర విజయ స్తూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. విజయ స్థూపం వద్ద పార్కును శుభ్రపరిచారు. సున్నాలు వేసి కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడించారు. సుమారు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండాలు ఇచ్చాపురంలో కనిపించాయి. ఆర్జె ఫంక్షన్ హాల్ వద్ద కూడా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పార్టీ శ్రేణులతో సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
వైఎస్ షర్మిల ఇచ్చాపురం పర్యటన…
85
previous post