Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Devotional బాల రామ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం…

బాల రామ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం…

by Prakash
TTD Chairman Bhumana Karunakar Reddy

రామ జన్మభూమి అయోధ్యలో బాల రామ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అని, టిటిడి చైర్మన్ గా ఉన్న కారణంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తరతరాలుగా కోరికగా మిగిలిన ఒక కల సాకారమై ఒక విగ్రహ రూపంలో రాముడే దివి నుంచి దిగి వచ్చినట్లు గా..మనలో మానవతా విలువలను పెంచి ప్రపంచాన్ని మార్చి మరళా రామ రాజ్యం తీసుకురావటానికి ఓ గొప్ప తాత్విక సందేశాన్ని ఇస్తున్నట్లు, ప్రపంచంలో హిందువులందరినీ ఏకతాటిపై నడిపిస్తూ గొప్ప సందేశం ఇచ్చినట్టు ఉందని,బాల రామ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొనడం మాటలలో చెప్పలేనిదని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అయోధ్యపురి శ్రీరామ నామస్మరణలతో మారుమ్రోగుతూ భక్తులంతా తన్మయంతో పూలలాడుతున్నారు. టీటీడీ ద్వార ఆహ్వానం రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని టిటిడి చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి అన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: