వైఎస్ షర్మిల ఇచ్చాపురం పర్యటన…

YS Rajasekhar Reddy Padayatra Vijay Stupam

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల 23వ తేదీ మంగళవారం ఇచ్చాపురంలో పర్యటించనున్నారు&period; ఈ మేరకు శ్రీకాకుళం డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు ఇచ్చాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడారు&period; వైయస్ షర్మిల పర్యటన వివరాలు వెల్లడించారు&period; ఉదయం 10&colon;30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర విజయ స్థూపం వద్ద వైయస్సార్ కు నివాళులర్పిస్తారన్నారు&period; అనంతరం ఆర్జె ఫంక్షన్ హాల్ లో పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారని తెలిపారు&period; అక్కడ నుండి నేరుగా విజయనగరానికి బయలుదేరుతారని ఆయన తెలిపారు&period; వైయస్ షర్మిల రాక సందర్భంగా ఇచ్చాపురం పట్టణంలో వైయస్సార్ పాదయాత్ర విజయ స్తూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు&period; విజయ స్థూపం వద్ద పార్కును శుభ్రపరిచారు&period; సున్నాలు వేసి కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడించారు&period; సుమారు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండాలు ఇచ్చాపురంలో కనిపించాయి&period; ఆర్జె ఫంక్షన్ హాల్ వద్ద కూడా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి&period; పార్టీ శ్రేణులతో సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్