రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన్నాని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో చేవెళ్లలోని బస్టాండ్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీమ్ భారత్, సోనియా గాంధీ మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ జన్మదిన్నాని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న 6 గ్యారంటీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని మిగతా 6 గ్యారంటీలను అతి త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే చేవెళ్ల సర్పంచ్ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా సోనియా గాంధీ కీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే లోకల్ భాడి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కీ మద్దతు తెలపాలని అమె కోరారు. తెలంగాణా మహిళల తరుపున మరొకసారి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల ప్రయాణికులు మాట్లాడుతూ.. మేము ఎప్పుడు అనుకోలేదని ఇలాంటిది ఉచిత ప్రయాణం చేస్తామని అని చాలా సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన భీమ్ భారత్..
87
previous post