84
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలులోని బంధువుల స్వగృహానికి మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు, దంపతులు కుటుంబ సమేతంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో విచ్చేశారు. నిడుబ్రోలు చేరుకున్న మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా.కంభంపాటి హరిబాబును గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పి.శ్రీఖర్, గుంటూరు వెస్ట్ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, పొన్నూరు మండల తహశీల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్, పొన్నూరు మునిసిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ లు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నిడుబ్రోలులో బంధువులు ఇంటిలో గడిపిన డాక్టర్ కంభంపాటి హరిబాబు సాయంత్రం 6:00 గంటల సమయంలో తిరిగి విజయవాడకు ప్రయాణమయ్యారు.