103
ప్రముఖ వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పెట్టిన కేసుపై సిఐడి విచారణ. గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్న అధికారులు. రామ్ గోపాల్ వర్మ పెట్టిన (క్రైమ్ నంబర్ 22/2023) కేసులో A6 గా ఉన్న రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ కు 17వ తేదీన అర్ధరాత్రి సమయంలో గుంటూరులో సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేసారు. A5 గా ఉన్న తిరువూరుకు చెందిన బండి శివకేశవ తో పాటు షేక్ ఫిరోజ్ ను ఈ నెల 19న ఉదయం గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి హాజరు కావాలని నోటిసులలో పేర్కొన్నారు. హాజరు కానీ పక్షములో అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.