మాజీ కేంద్రమంత్రి సినీ నటుడు దివంగత యూవీ కృష్ణంరాజు జయంతి వేడుకలు స్వగ్రామం మొగల్తూరులో అభిమానులు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పెద్ద కుమార్తె ప్రసిద్ధ లు పాల్గొని కృష్ణంరాజు బర్త్ డే కేక్ ను కట్ చేశారు. అనంతరం యూకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ మెగా వైద్య శిబిరాన్ని మొగల్తూరు స్థానిక అందే బాపన్న కళాశాల నందు ఏర్పాటు చేశారు. ఈ వైద్యం శిబిరంలో యూకేపి చెందిన ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు కె వేణు ప్రముఖ భీమవరం హాస్పిటల్ వర్మ తదితర ప్రముఖ డాక్టర్లు పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు. డయాబెటిక్ పేషెంట్లను ఎడాప్ట్ చేసుకుని వారికి జీవితకాలం వైద్య సదుపాయం అందిస్తామని డాక్టర్ వేణు తెలిపారు. కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా వారి స్వగ్రామం మొగల్తూరులో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవి నాయుడు అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు చేసి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి కృష్ణంరాజు అని గుర్తు చేశారు.
మొగల్తూరి మారాజు.. కృష్ణంరాజు జయంతి వేడుకలు
71