మాజీ కేంద్రమంత్రి సినీ నటుడు దివంగత యూవీ కృష్ణంరాజు జయంతి వేడుకలు స్వగ్రామం మొగల్తూరులో అభిమానులు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పెద్ద కుమార్తె ప్రసిద్ధ లు పాల్గొని కృష్ణంరాజు బర్త్ డే కేక్ ను కట్ చేశారు. అనంతరం యూకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ మెగా వైద్య శిబిరాన్ని మొగల్తూరు స్థానిక అందే బాపన్న కళాశాల నందు ఏర్పాటు చేశారు. ఈ వైద్యం శిబిరంలో యూకేపి చెందిన ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు కె వేణు ప్రముఖ భీమవరం హాస్పిటల్ వర్మ తదితర ప్రముఖ డాక్టర్లు పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు. డయాబెటిక్ పేషెంట్లను ఎడాప్ట్ చేసుకుని వారికి జీవితకాలం వైద్య సదుపాయం అందిస్తామని డాక్టర్ వేణు తెలిపారు. కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా వారి స్వగ్రామం మొగల్తూరులో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవి నాయుడు అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు చేసి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి కృష్ణంరాజు అని గుర్తు చేశారు.
prabhas
పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు లో ఘనంగా మాజీ కేంద్రమంత్రి సినీ నటుడు రెబల్ స్టార్ యు.వి.కృష్ణంరాజు జయంతి వేడుకలు. స్వగ్రామం మొగల్తూరు లో జయంతి వేడుకల్లో పాల్గొన్న భార్య శ్యామల దేవి, కుమార్తె ప్రసిద్ధ. కృష్ణంరాజు నివాసానికి భారీగా చేరుకున్న అభిమానులు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకు ను కట్ చేసిన కృష్ణంరాజు భార్య, కుమార్తె. కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా మొగల్తూరు లో ఉచిత షుగర్ వ్యాధి మెగా వైద్య శిబిరం.
ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో కల్కిలో చూస్తారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె అందరి ఫ్యాన్స్, ఆడియన్స్ గొప్పగా ఎంజాయ్ చేసేలా ‘కల్కి’ వుంటుంది: డైరెక్టర్ నాగ్ అశ్విన్
ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది.
తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటీ బాంబేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్ ఫెస్ట్’23లో కల్కి 2898 AD’ ప్రత్యేక కంటెంట్ ను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన Q &Aలో ‘కల్కి 2898 AD’ చిత్రానికి సంబధించిన విశేషాలని పంచుకున్నారు నాగ్ అశ్విన్.
మిగతా సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు కల్కికి ఎంత భిన్నంగా వుంటుంది.. ?
-మన దగ్గర సైన్స్ ఫిక్షన్ చిత్రాల ఎక్కువ రాలేదనే చెప్పాలి. కొన్ని టైం ట్రావెల్ సినిమాలు వచ్చాయి . కల్కి చాలా డిఫరెంట్ ఫిల్మ్. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. హాలీవుడ్ ఫ్యుచరిస్ట్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్ లో ఎలా ఉంటాయో చూశాం. ‘కల్కి’లో ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా వుండబోతునాయో ప్రేక్షకులు చూస్తారు. ‘కల్కి’ కోసం దాదాపు ఐదేళ్ళుగా శ్రమిస్తున్నాం. ప్రతి అంశంపై లోతుగా అలోచించి, స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక న్యూ వరల్డ్ ని బిల్డ్ చేశాం. ప్రేక్షకులకు అది తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను.
టీజర్ లో కొత్త ఆయుధాలు కనిపించాయి.. వాటి గురించి చెప్పండి ?
-కల్కి కోసం చాలా డిజైన్ వర్క్ చేశాం. కాన్సెప్ట్ ఆర్టిస్ట్ లు, ప్రొడక్షన్స్ డిజైనర్స్ ఇలా టీం అంతా కలసి చాలా మేధోమధనం చేశారు. ఇందులో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్ ప్రతిది భారతీయ మూలంతో ముడిపడి అది భవిష్యత్ లో ఎలా మార్పు చెందే అవకాశం వుందనే అంశంపైన ప్రత్యేక శ్రద్ద తీసుకొని ప్రతిది డిజైన్ చేశాం. తెరపై అది అద్భుతంగా కనిపిస్తుందనే నమ్మకం వుంది.
ప్రభాస్ గారితో పాటు మితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు కదా.. వారి పాత్ర గురించి చెబుతారా ?
-వారి పాత్రలు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పకూడదు. అయితే మితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు , దీపికా పదుకొణె.. వీళ్ళ అభిమానులంతా అమితంగా ఆనందపడే పాత్రల్లో వారు కనిపిస్తారు. ఇదివరకూ ఎప్పుడూ ఇలాంటి పాత్రల్లో వారు కనిపించలేదు. తప్పకుండా ఫ్యాన్స్ ని అలరిస్తారు.
కల్కికి… ‘2898 AD’ అనే టైమ్ లైన్ పెట్టడానికి కారణం ఏమిటి ?
-దీనికి వెనుక ఒక లాజిక్ వుంది. అయితే అది సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో చెబుతాను(నవ్వుతూ)
ఈ చిత్రం మ్యూజిక్ కోసం సంతోష్ నారాయణ్ ని తీసుకోవడానికి కారణం ?
-ఇండియన్ రూట్ తో వరల్డ్ ఫీలింగ్ కలిగించే మ్యూజిక్ ఇచ్చే కొద్దిమంది కంపోజర్స్ లో సంతోష్ నారాయణ్ ఒకరు. అందుకే ఆయన్ని తీసుకోవడం జరిగింది.
కల్కి కోసం ప్రభాస్ గారు ఎలా మేకోవర్ అయ్యారు ? ఇందులో ప్రభాస్ ని కొత్తగా చూడొచ్చా ?
-కల్కిలో ఫ్యూచర్ ప్రభాస్ ని చూస్తారు(నవ్వుతూ)
కల్కి, విష్ణు అవతారం అంటారు కదా.. మీరు కూడా నాగీ యూనివర్స్ ని ప్లాన్ చేస్తున్నారా ?
-లేదు(నవ్వుతూ)
ప్రభాస్, కమల్ హసన్, అమితాబ్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
-అందరూ అద్భుతమైన వ్యక్తులు. గ్రేట్ యాక్టర్స్. చాలా హంబుల్ గా వుంటారు. వారికి సినిమా అంటే ప్రేమ, ఇష్టం. వీరిలో వుండే సిమిలర్ క్యాలిటీ ఇది.
కల్కి రిలీజ్ డేట్ ఎప్పుడు ?
-త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం
కల్కి ట్రైలర్ ఎప్పుడు విడుదల కావచ్చు ?
-93రోజుల తర్వాత ఉండొచ్చు (నవ్వుతూ)
ఆల్ ది బెస్ట్ అండీ
థాంక్ యూ
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘కన్నప్ప’ చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే కన్నప్ప పోస్టర్‌తో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నారు.
న్యూజిలాండ్‌లో 90 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఫస్ట్ షెడ్యూల్ ముగిసిందని కన్నప్ప చిత్రయూనిట్ ప్రకటించింది. న్యూజిలాండ్, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన 600 మంది ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో ఈ ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశామని మేకర్లు తెలిపారు. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు ఇండియాకు తిరిగి రానుంది.
విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని దాదాపు 80 శాతం వరకు న్యూజిలాండ్‌లోనే షూట్ చేయనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు.
ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టుగా మోహన్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా ట్వీట్ వేశారు. ‘న్యూజిలాండ్ లో 600 మంది హాలీవుడ్, మరియు భారతదేశంలోని అతిరధ మహారధులైన నటీనటులతో, థాయిలాండ్ మరియు న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో, విష్ణు మంచు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. 90 రోజుల మొదటి షెడ్యూల్ న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నాం’ అని ప్రకటించారు.
పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద విష్ణు మంచు నిర్మిస్తున్నారు.
యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాలర్ చిత్రం విడుదల సందర్బంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో థియేటర్ల ముందు ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేసారు. భారీ ఎత్తున బాణాసంచా పేలుస్తూ, డ్రమ్స్ కొడుతు ప్రభాస్ చిత్రపటానికి పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించారు. సినిమా ప్రారంభమైనప్పటి నుండి చివరి వరకు అభిమానుల విజిల్స్, నడుమ తియేటర్ మొత్తం దద్దరీల్లి పోయింది. అయితే చిత్రం స్నేహం యొక్క విలువ తెలిపేలా ఉందని అభిమానులు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నరసాపురం పట్టణంలో 216 నేషనల్ హైవేపై ప్రభాస్ అభిమానులు బైక్‌లతో వీరంగం సృష్టించారు. దీనితో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అభిమానుల తీరుపై ప్రయాణీకులు మండిపడ్డారు. అబిమానులు సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలవాలి తప్ప బైక్ లతో వీరంగం సృష్టించటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసులు ఎక్కడా కనిపించలేదు.






Total views : 141392