కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం నుండి పెండ్యాల గ్రామం వరకు వైకాపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. పెండ్యాల గ్రామంలో మంచినీటి ట్యాంకు, సిసి రోడ్డును ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ రాజకీయాలు అనేవి మనం స్వచ్ఛంగా చేయాలని, ఈ ప్రాంతంలో నాకు ఓటేసారు అంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేయాలని అన్నారు. కేశినేని చిన్ని, బుద్ధ వెంకన్నను ఉద్దేశిస్తూ నా స్థాయికి తక్కువ గల మనుషుల గురించి నేను మాట్లాడను. చీటర్స్ గురించి, బ్రోతల్ హౌసులు నడిపే వారి గురించి, కాల్ మనీ చేసే వారి గురించి మీరు మీడియాలో అనవసరంగా మాట్లాడించి పెద్దోళ్ళని చేస్తున్నారు. దయచేసి వారి గురించి నేను మాట్లాడి నా స్థాయి తగ్గించుకోలేనని ఆయన అన్నారు. నా స్థాయికి చంద్రబాబు గురించి అడిగితే చెప్తా, లోకేష కూడా నా స్థాయికి తక్కువేనని అన్నారు. కొంతమంది పాపులారిటీ కోసం నా మీద మాట్లాడతారని, ఎలక్షన్ అయ్యాక బాక్సులు తెరిచాక ఎవరి పార్టీ ఖాళీ అవుతుందో తెలుస్తుంది వారి గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించవద్దని ఆయన అన్నారు. త్వరలో నా అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి వైకాపా పార్టీలోకి ఆహ్వానిస్తాను ఎవరిని బలవంతం చేయను. ముఖ్యమంత్రిగా జగన్ గారు పిలవగానే ఆయన మాట కాదనలేక జాయిన్ అయ్యాను త్వరలో మా అనుచరులతో సమావేశం అవుతానని అన్నారు. నందిగామ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. నందిగామ పట్టణాన్ని కూడా విజయవాడ పట్టణానికి ధీటుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
నా స్థాయికి తక్కువ గల మనుషుల గురించి నేను మాట్లాడను…
81