ఎన్టీఆర్ జిల్లా, మైలవరం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన సీఐటీయూ నాయకులు, అంగన్వాడీలు. పోలీస్ స్టేషన్ ముందు ఒక్కసారిగా రహదారిపై బైఠాయించిన అంగన్వాడీ ఉద్యోగులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. స్థంబిస్తున్న ట్రాఫిక్. రోడ్ పై బైఠాయించిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు. అడ్డుకున్న అంగన్వాడీ ఉద్యోగులు. పోలీసులు, అంగన్వాడీ వర్కర్స్ మద్య పెనుగులాట, ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి పోలీసుల పై తిరగబడుతున్న అంగన్వాడీ ఉద్యోగులు. అదుపులోకి తీసుకోబోయే మహిళా పోలీసులను రోడ్డుపై కూర్చోబెట్టిన అంగన్వాడీ వర్కర్. పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న అంగన్వాడీ వర్కర్స్. నిలువరించలేకపోతున్న పోలీసులు సీఐ మోహన్ రెడ్డి రంగప్రవేశం. పోలీసులను కొడతారా అంటూ అంగన్వాడీ ఉద్యోగులు, సీఐటీయూ నాయకుల పై మండిపడ్డ సీఐ. మహిళా పోలీసుల వల్ల కాకపోవడంతో సీఐ, ఎస్సై కలిసి మహిళలను వాహనం ఎక్కించి తరలిస్తున్న వైనం. పోలీస్ స్టేషన్ లోపల అరుపులు వినపడటంతో మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేసినా. పోలీసులు గేట్లు వేసి మీడియాని లోపలికి అనుమతించని పరిస్థితి.
మైలవరం లో తీవ్ర ఉద్రిక్తత..
89
previous post