రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల రైతుల ఖాతాలలో తక్షణమే నష్ట పరిహారం జమచేయాలనీ డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో రైతులు మెడకు ఉరి తాళ్లు వేసుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఏ సీజన్ లో అయితే పంటలు వేసి రైతులు నష్టపోతారో అదే సీజన్ లో కరువు ప్రాంతాలు గా గుర్తించి ఆ రైతుల ఖాతాలలో తక్షణమే నష్ట పరిహారం అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు కరువు మండలంగా ప్రకటించి మూడు నెలలు గడుస్తున్న రైతుల ఖాతాలలో నష్టపరిహారం జమ చేయలేదన్నారు. ఇలా రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పొతే రైతులకు ఆత్మహత్య లే శరణ్యం అవుతాయని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతుల ఖాతాలలో నష్టపరిహారం జమ చేయాలనీ లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. Read Also
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.