రేపు జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 39 వేల 748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలను, 7 వందల మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం లలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో జరగనున్న ఎన్నికలలో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. 1998 నుండి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తుండగా, తొలిసారి AITUC విజయం సాధించింది. ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించగా మూడుసార్లు AITUC, రెండుసార్లు TBGKS, ఒకసారి INTUC విజయం సాధించాయి.
Read Also..
Read Also..