Narasapuram :
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రూ 27 కోట్లతో చేపడుతున్న ఏటిగట్టు పనుల్లో మరోసారి డోల్లతనo బయటపడింది. గత నెలలో 100 మీటర్ల మేర గట్టు గోదావరిలోకి కృంగిపోయింది. మళ్లీ చేపట్టిన పనులు కూడా వృధా అయ్యాయి అర్ధరాత్రి కోతకు గురైన చోట వేసిన రాళ్లన్నీ గోదావరిలోకి కృంగిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 2022 గోదావరి వరదకు ఏటిగట్టు సుమారు 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది. ఈ పనులను గత ఏడాది ఏప్రిల్ లో చేపట్టారు. వాడుతున్న రాళ్లు నాసిరకమైన, ప్రభుత్వం తిరస్కరించిన క్వారీ నుంచి రాళ్లు తీసుకొచ్చి పనులు చేపడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ఆందోళన కూడా చేశారు. ఈ ఫిర్యాదు పై ప్రభుత్వం స్పందించలేదు. అధికారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు. నీటిలో రాళ్లు గట్టి పడే వరకు ఇలా కృంగితోనే ఉంటుందని దీనికి ఆందోళన చెందనవసరం లేదని చెప్పడం గమనార్హం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.