70
విజయవాడ లో అర్దరాత్రి ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీల టెంట్లు పీకేసిన పోలీసులు. అడ్డుపడిన అండగన్వాడీల అరెస్ట్ చేసిన పోలీసులు. నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలు. ఇప్పటికే బస్టాండ్ , రైల్వేస్టేషన్ లలో పికెటింగ్ నిర్వహిస్తూ అంగన్వాడీలు ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. ఎస్మాచట్టం అమలులో ఉంది కాబట్టి చలో విజయవాడ కు అనుమతి లేదన్న సీపీ. అంగన్వాడీలపై చర్యలకు సిద్దమవుతున్న ప్రభుత్వం. విధులకు హాజరు కాని అంగన్వాడీల తొలగింపుకు ఉత్తర్వులు సిద్దం చేసిన కృష్ణాజిల్లా, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్లు. 42 రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలు.