71
అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఏలూరులో ధర్మబేరి ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించారు. ఉదయం నుండి హనుమాన్ చాలీసా పారాయణం, అనంతరం యాగ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాల నేతలతో పాటు పలువురు ముస్లిం సోదరులు పాల్గొని అయోధ్య లోని బాలరామ విగ్రహ ప్రతిష్టకు సంఘీభావం తెలిపారు.