రాంనగర్ చౌరస్తాలో బీజేపీ సమావేశం…

Kishan Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్&comma; బి ఆర్ ఎస్&comma; ఎంఐఎం పార్టీలు కుట్రలు పన్ని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు కంకణం కట్టుకున్నారని కేంద్రమంత్రి&comma; బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు&period; తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి&comma; టిఆర్ఎస్ పార్టీకి&comma; ఎంఐఎంకు ఓటు వేసిన ఎవరూ ప్రధాని కాలేరని ఆయన ఎద్దేవా చేశారు&period; దేశం కోసం మోదీ&comma; మోడీ కోసం మనం ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అంటూ నిర్వహించిన విజయ సంకల్పయాత్రలో భాగంగా రాంనగర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధి హాజరై మాట్లాడారు&period; దేశంలో కుటుంబ పాలన కోసం పనిచేసే కాంగ్రెస్&comma; టిఆర్ఎస్ లకు ఓటు వేస్తే వచ్చేది ఏమీ లేదన్నారు&period; ప్రజలను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాగ్దానాలు చేసిందని&comma; గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయ లేదనీ అన్నారు&period; రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ టిఆర్ఎస్&comma; ఎంఐఎం పార్టీలకు ఓటు వేస్తే ఆ ఓటు వృధా అయిపోతుందనీ దేశ ప్రజల కోసం యువత కోసం నిత్యం ఆలోచించే దేశ ప్రధాని నరేంద్ర మోదిని మూడోసారి గెలిపిస్తేనే దేశానికి&comma; దేశంలో ఉన్న యువత&comma; ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు&period; ఏది ఏమైనా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్&comma; టిఆర్ఎస్&comma; ఎంఐఎం పార్టీలను చిత్తుగా ఓడించి బిజెపికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో బిజెపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..