సీఎం జగన్ (CM Jagan) :
ఎన్నికలకు సమయం దగ్గర పడిందని, పేదల వ్యతిరేకులను ఓడించాలని సీఎం జగన్ (CM Jagan) పిలుపునిచ్చారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్లో ‘మేమంతా సిద్ధం’ సభలో జగన్ ప్రసంగించారు. పెత్తందారులకు చంద్రబాబు, పవన్ అనుకూలమని, తాము మాత్రం పేదల కోసమే ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పుడు పెత్తందారుల అనుకూల వర్గానికి, పేదల అనుకూల వర్గానికి మధ్య క్లాస్ వార్ జరుగుతోందన్నారు. తాము గెలిస్తే పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. పొరపాటున కూడా చంద్రబాబుకు ఓటు వేయొద్దని ప్రజలకు సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుందని, పశుపతి నిద్రలేచి వదల బొమ్మాళి అంటారని ఎద్దేవా చేశారు. ప్రజలు వేసే రెండు ఓట్లు కూడా వైసీపీ అభ్యర్థులకే వేయాలని సీఎం కోరారు. ఫ్యాన్‌కు ఓటేస్తే అవ్వాతాతలకు ఇంటి వద్దే 3 వేలు పింఛన్ అందుతుందని తెలిపారు. చంద్రబాబుకు ఓటు వేస్తే జన్మభూమి కమిటీలు మళ్లీ దోచుకుంటాయన్నారు. వైసీపీకి ఓటు వేస్తే లంచాలు, వివక్షత లేని పారిపాలన అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…