సీఎం జగన్ (CM Jagan) :
ఎన్నికలకు సమయం దగ్గర పడిందని, పేదల వ్యతిరేకులను ఓడించాలని సీఎం జగన్ (CM Jagan) పిలుపునిచ్చారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్లో ‘మేమంతా సిద్ధం’ సభలో జగన్ ప్రసంగించారు. పెత్తందారులకు చంద్రబాబు, పవన్ అనుకూలమని, తాము మాత్రం పేదల కోసమే ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పుడు పెత్తందారుల అనుకూల వర్గానికి, పేదల అనుకూల వర్గానికి మధ్య క్లాస్ వార్ జరుగుతోందన్నారు. తాము గెలిస్తే పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. పొరపాటున కూడా చంద్రబాబుకు ఓటు వేయొద్దని ప్రజలకు సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుందని, పశుపతి నిద్రలేచి వదల బొమ్మాళి అంటారని ఎద్దేవా చేశారు. ప్రజలు వేసే రెండు ఓట్లు కూడా వైసీపీ అభ్యర్థులకే వేయాలని సీఎం కోరారు. ఫ్యాన్‌కు ఓటేస్తే అవ్వాతాతలకు ఇంటి వద్దే 3 వేలు పింఛన్ అందుతుందని తెలిపారు. చంద్రబాబుకు ఓటు వేస్తే జన్మభూమి కమిటీలు మళ్లీ దోచుకుంటాయన్నారు. వైసీపీకి ఓటు వేస్తే లంచాలు, వివక్షత లేని పారిపాలన అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం…
- చేనేతకు అండగా ఎన్డీయే ప్రభుత్వం-చంద్రబాబు.చేనేత భారతదేశ గర్వకారణమని… ఆ కళను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీఎం… చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి…
- అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తనపై నమోదైన కేసులు, గతంలో జరిగిన అరెస్టుల వ్యవహారంపై జేసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులతో ఇక మాట్లాడేది లేదని.. తనపై నమోదైన కేసులన్నింటినీ న్యాయస్థానాల్లోనే…