ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్.

Advertisements

<p>వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై&comma; ఖాన్ దురాని&comma; సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం &&num;8220&semi;కళ్యాణం కమనీయం జీవితం&&num;8221&semi;&period; అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది&period; తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు&period; తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి దర్శకులు వీఎన్ ఆదిత్య&comma; రాంప్రసాద్&comma; నిర్మాత మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు&period; ఈ సందర్భంగా<&sol;p>&NewLine;<p>హీరోయిన్ సాహితి అవంచ మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;కళ్యాణం కమనీయం జీవితం&&num;8221&semi; ఒక బ్యూటిఫుల్ ఫిలిం&period; అంతా ఫ్రెష్ టీమ్ ఈ మూవీకి వర్క్ చేశారు&period; ఆర్టిస్టులు కూడా చాలా మంది న్యూ యంగ్ టాలెంట్ నటించారు&period; మా సినిమా ప్లెజెంట్ గా ఉంటూనే చివరలో ఒక మంచి ట్విస్ట్ తో ఆకట్టుకుంటుంది&period; మా కొత్త టీమ్ చేసిన ఈ సినిమాను మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ &&num;8211&semi; మా ప్రొడ్యూసర్స్ గతంలో కొన్ని మంచి మూవీస్ చేశారు&period; నేను హీరోగా కొత్తవాడినైనా ఈ చిత్రంలో అవకాశం కల్పించారు&period; మా మూవీ టీజర్&comma; సాంగ్స్ చూశారు కదా&period; మీ అందరికీ నచ్చాయని నమ్ముతున్నాం&period; సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉంటాయి&period; శ్రీ మురళి మా మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చారు&period; &&num;8220&semi;కళ్యాణం కమనీయం జీవితం&&num;8221&semi; సినిమా ఒక కొత్త తరహా కథతో కథనంతో మీ అందరినీ ఆకట్టుకుంటుంది&period; మీ సపోర్ట్ మా మూవీకి ఉండాలి&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ మురళీ కార్తికేయ మాట్లాడుతూ &&num;8211&semi; నేను కంపోజర్ అయ్యేందుకు స్ఫూర్తినిచ్చిన మూవీ మనసంతా నువ్వే&period; ఆ చిత్ర దర్శకులు వీఎన్ ఆదిత్య గారు మా సినిమా ఈవెంట్ కు అతిథిగా రావడం&comma; మా అందరికీ బెస్ట్ విశెస్ అందించడం సంతోషంగా ఉంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ &&num;8211&semi; ఈ సినిమాకు దర్శక నిర్మాతలు &&num;8220&semi;కళ్యాణం కమనీయం జీవితం&&num;8221&semi; అనే మంచి టైటిల్ పెట్టారు&period; టైటిల్ కు తగినట్లే మంచి సంగీతం&comma; సాహిత్యం ఈ సినిమాకు కుదిరాయి&period; తెలుగుదనం ఉట్టిపడే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా&period; ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ &&num;8211&semi; తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం చూస్తున్నాం&period; అలాంటి టైమ్ లో &&num;8220&semi;కళ్యాణం కమనీయం జీవితం&&num;8221&semi; అనే మంచి తెలుగు టైటిల్ ను పెట్టారు దర్శకుడు రవి లోకిరెడ్డి&period; ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది&period; ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునే మూవీగా మిగిలిపోతుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;కళ్యాణం కమనీయం జీవితం&&num;8221&semi; టైటిల్ చూసి మీకు పెళ్లయ్యిందా అని డైరెక్టర్ ను అడిగాను&period; టీజర్ చూస్తే ఆకట్టుకునేలా ఉంది&period; ఇంత భారీగా తెరకెక్కించారు&period; తన లైఫ్ నుంచి ఇన్స్ పైర్ అయ్యి చేసిన సినిమా ఇదని డైరెక్టర్ రవి చెప్పారు&period; చాలామంది కొత్త దర్శకులు రూపొందించే ప్రేమ కథలు వారి నిజ జీవితాల నుంచి స్ఫూర్తి పొందినవే ఉంటాయి&period; అవన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి&period; అలాగే &&num;8220&semi;కళ్యాణం కమనీయం జీవితం&&num;8221&semi; సినిమా కూడా మంచి విజయం సాధించాలి&period; టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ కిషోర్ గుండాల మాట్లాడుతూ &&num;8211&semi; మా &&num;8220&semi;కళ్యాణం కమనీయం జీవితం&&num;8221&semi; సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విజయేంద్రప్రసాద్ గారు చేశారు&period; అలాగే మా చిత్రంలో చంద్రబోస్ గారు పాట రాశారు&period; ఇప్పుడు వీఎన్ ఆదిత్య గారు అతిథిగా వచ్చారు&period; ఇంతమంది పెద్ద వాళ్ల సపోర్ట్ మా టీమ్ కు దక్కడం సంతోషంగా ఉంది&period; నేను కార్పొరేట్ ప్రపంచం నుంచి సినిమాల మీద ప్యాషన్ తో టాలీవుడ్ కు వచ్చాను&period; యూఎస్ లో ఫిలింమేకింగ్ మీద కోర్స్ చేశాను&period; గతంలో 24 కిస్సెస్ సహా మరికొన్ని చిత్రాలు నిర్మించాము&period; ఇప్పుడు &&num;8220&semi;కళ్యాణం కమనీయం జీవితం&&num;8221&semi; సినిమా చేస్తున్నాం&period; మరో సినిమా కూడా లైనప్ లో ఉంది&period; ఇదొక బ్యూటిఫుల్ ఫిలిం&period; ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ &&num;8211&semi; నా ఎన్నో ఏళ్ల కష్టం ఈ సినిమా వెనక ఉంది&period; నా నిజ జీవితంలోని కొన్ని ఇన్సిడెంట్స్ కు ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాను&period; చాలా మంచి లవ్ స్టోరీ ఇది&period; డ్రామా&comma; సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి&period; చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది&period; ఈ కథ రాసినప్పుడు రైటర్ అరవింద్ ఒక కొత్త పాయింట్ ను యాడ్ చేశాడు&period; ఆ పాయింట్ తో మూవీ స్క్రిప్ట్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది&period; మా ప్రొడ్యూసర్స్ ఎంతో సహకరించారు&period; మా టీమ్ చాలా ప్యాషన్ తో వర్క్ చేశారు&period; మంచి సాంగ్స్ కుదిరాయి&period; &&num;8220&semi;కళ్యాణం కమనీయం జీవితం&&num;8221&semi; సినిమా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది&comma; ఎంగేజ్ చేస్తుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండలో ఆర్‌ఐపై రైతుల తీవ్ర ఆరోపణలు.

పంచదార్ల కొండను నాన్‌మైనింగ్ జోన్‌గా మార్పు – కొల్లు.

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.