వైద్య సేవల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం. డేగల ప్రభాకర్… ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. నగరం లో ప్రతి ఆదివారం నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంప్ లో భాగంగా ఈ రోజు తూర్పు నియోజకవర్గంలోని శారదకాలని 32 వ లైన్ లో నిర్వహించారు. ఈ క్యాంప్ లో 4 డాక్టర్ల బృందం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణి చేశారు. ఈ వైద్య శిభిరం లో సుమారు 280 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నిజానికి టెక్నాలజీ రోజుల్లో అన్ని సమస్యలకు మందులు ఉన్నప్పటికీ పెద్దపెద్ద రోగాలకు ముందుగా మనం భయపడే తీరు మన రోగాన్ని పెంచుతుందన్నారు. ఇందులో నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు అయితే మరింత దయనీయంగా ప్రతినిత్యం బాధపడుతూన్నారన్నారు. అలంటి వారి కోసం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికి నగరంలో 6 మెడికల్ క్యాంప్ లు నిర్వహించామన్నారు. ఓపిక లేక, ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోలేని వృద్ధుల కోసం, ఆర్థిక సంపాదన లేని సామాన్య ప్రజల కోసం, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది తమ ఆశయం అన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి మెడికల్ క్యాంపు సేవలు సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషముగా ఉందన్నారు. పేద ప్రజలకు అవసరసమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనీ ఆరోపించారు. కేవలం వైద్య పరీక్షలు చేయడం మాత్రమే కాకుండా, వారికి అవసరమైన మందులు కూడా పంపిణీ చేస్తున్నాం అన్నారు. ఈ మెగా మెడికల్ క్యాంపుకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని, పెద్ద సంఖ్యలో రోగులు నిష్ణాతులైన వైద్యుల వద్ద వైద్య చికిత్సలు అందించుకున్నారు. వైసీపీ కేవలం మాటల ప్రభుత్వమని మండిపడ్డారు. ఏ ఒక్క ప్రభుత్వం వైద్యశాలలో కనీస సౌకర్యాలు లేవని, డాక్టర్లు కూడా అందుబాటులో లేరన్నారు. ప్రజలు ఆరోగ్యం పట్ల జగన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ కార్యాక్రమమం లో డాక్టర్ అన్వేష్, డాక్టర్ రాజా, డాక్టర్ గోపి, డాక్టర్ పవన్, చిట్టెం సింధు, మహంకాళి నరసింహారావు, యర్రమల కిరణ్, సౌపాటి రత్నం, మల్లెంపూడి శ్రీను, కొత్తూరి వెంకట్, లింగంగుంట్ల ఆదాం, రాయవరపు బాబురావు, బాజీ మాస్టర్, నిశంకరరావూ అమర్నాధ్, కొండెపు శేఖర్, బండ్లమూడి రాధమ్మ, చౌదరి శ్రీను, కొలగాని సుబ్బారావు, బొక్కిసమ్ శివరామ్, అడపా ప్రసాద్ బాబు, బీరం శ్రీనివాసరావు, షేక్ సుభాని, జనసేన నాయకులూ శ్యాం, కిషోర్, దళవాయి భార్గవ్, వెంకటేశ్వర్లు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మంచి వైద్యం అందించడమే మా లక్ష్యం..
97
previous post