‘మట్టి’ని తింటూ అంగన్వాడీల వినూత్న నిరసన

anganwadi protest at gooty

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ సమ్మె 37వ రోజు చేరుకున్న నేపథ్యంలో మట్టి తింటూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడి మహిళలు&period; అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 36 రోజులుగా చేస్తున్న నిరవదిక సమ్మె బుధవారం 37వ రోజుకు చేరింది&period; అందులో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడి టీచర్ల దీక్షా శిబిరంలో మట్టిని తింటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు&period; అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ గత 36 రోజులుగా అంగన్వాడి టీచర్లు నిరవదిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్ పై మండిపడ్డారు&period; తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంఘాలతో చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు&period; లేని పక్షంలో ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు&period; అంగన్వాడి యూనియన్ నాయకులతో ఐదు సార్లు చర్చలు జరిపి విఫలం చేయడం చాలా విడ్డూరమన్నారు&period; ఇచ్చిన హామీలను జీవో రూపంలో ఇస్తే తక్షణమే నిరవధిక సమ్మెను విరమింప చేస్తామని అంగన్వాడి టీచర్లు పేర్కొన్నారు&period; ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లలు&comma; ఆయాలు&comma; సిఐటియు నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్