అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం….

International Day of Persons with Disabilities...

Advertisements

&NewLine;<p>వైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు&period; హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలను నిర్వహించారు&period; ఈ పోటీల ప్రారంభోత్సవానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మాదిరిగా క్రీడారంగంలోనూ దివ్యాంగులు ముందుకెళ్తున్నారని అన్నారు&period; దివ్యాంగులు క్రీడల్లో రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు&period; భవిష్యత్తులో దివ్యాంగుల కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లా సంక్షేమ శాఖ ప్రోత్సహించాలన్నారు&period; దివ్యాంగుల సంక్షేమం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు&period; వైకల్యాన్ని అధిగమించేలా దివ్యాంగులను ఉత్సాహపరిచే విధంగా ప్రోత్సహించాలన్నారు&period; ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ క్రీడలు మనలోని శక్తిని&comma; ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయని అన్నారు&period; క్రీడా పోటీల్లో పాల్గొంటున్న దివ్యాంగులందరికీ అభినందనలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె&period; మధురిమ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు&period; దివ్యాంగులు క్రీడా పోటీల్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొంటుండడం అభినందనీయమన్నారు&period; ఈ నెల 15వ తేదీన హనుమకొండ అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా క్రీడల్లో పాల్గొన్న దివ్యాంగులకు బహుమతులు&comma; ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు&period; వేడుకలకు దివ్యాంగులు హాజరుకావాలని కోరారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు&period; కాగా పరుగు&comma; షాట్ పుట్&comma; జావెలిన్ త్రో&comma; చెస్&comma; క్యారమ్స్&comma; తదితర క్రీడా పోటీల్లో దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..