తిరుపతి, టిటిడి కేటాయిస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోను వ్యతిరేకిస్తున్న విపక్షాలు. పట్టా పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటారని ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. మహతి ఆడిటోరియం లో పట్టా పంపిణీ కార్యక్రమంలో భారీ పోలీసు బందోబస్తు. తిరుపతిలో టిడిపి, జనసేన, సిపిఎం నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. టిటిడి ఉద్యోగస్తులకు పట్టాల పంపిణీని స్వాగతిస్తున్నాం అని, కానీ పట్టాలపై ఓపక్క వెంకటేశ్వర స్వామి ఫోటో, మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు టిడిపి సీనియర్ నాయకులు వూకా విజయ కుమార్. టిడిపి నాయకులను జనసేన నాయకులను హౌస్ అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు ఇంటి పట్టాలపై వేసిన ఫోటోలు రేపు సేవా టికెట్లపై అలాగే టిటిడి సంబంధించిన వెబ్సైట్లో కూడా జగన్ ఫోటో పెడతారా అంటూ టిటిడిఈఓ ధర్మారెడ్డిని, చైర్మన్ కరుణాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ద్వారా గాని టీటీడీ నిధులు తో గాని ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. టిటిడి ఉద్యోగస్తులు వారి సొంత డబ్బుతో కొనుక్కుంటున్న జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. కేవలం కరుణాకర్ రెడ్డి తన కొడుకు అభినయ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని,ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి కూడా వీలు లేకుండా పోలీసులతో హౌస్ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచిది కాదని త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు.
టిటిడి ఇళ్ల పట్టాల పై జగన్ బొమ్మ అవసరమా?
156