కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలంలో ని అన్ని గ్రామాల్లో మంత్రి జోగి రమేష్ విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను, శ్రేణులను కలిసి 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2024 లో గెలిచేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు అని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి అని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుంది అని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునే దమ్ము ప్రతిపక్షాలకు లేదు అని, ఎన్ని పార్టీలు గుంపులుగా వచ్చిన భయపడే ప్రసక్తి లేదని ప్రజల గుండెల్లో మేము స్థానం సంపాదించుకున్నామని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం లో 2019 ఎన్నికల్లో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచి పెనమలూరు గడ్డపై వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తామని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
ఉయ్యూరు లో జోగి రమేష్ విస్తృత పర్యటన
83
previous post