విజయవాడ, కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రి, మాట్లాడుతూ 5 సంవత్సరాలు నా కొడుకు జైల్లోనే ఉన్నాడు. జగన్ కోర్ట్ కి వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు. కోర్ట్ కి రావడం లేదు. జగన్ సాక్ష్యం చెప్పి నా కుటుంబాన్ని ఆదుకోవాలి. జైల్ లో నా కొడుకు ఆమరణ దీక్ష చేస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు. రేపటి నుండి జైల్లోనే శ్రీను దీక్ష చేస్తున్నాడు. సుబ్బరాజు శ్రీను సోదరుడు. నా తమ్ముడు వల్ల జగన్ లబ్ది పొందాడు. నా తమ్ముడు దళితుడు అనే వివక్ష న్యాయస్థానాలు కూడా చూపిస్తున్నాయి. రేపు ఉదయం దుర్గమాత సాక్షిగా ఆమరణ దీక్షా చేస్తున్నాం. ప్రాణాలైన అర్పిస్తాం పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టం. డబ్బున్న వాడికి ఒక న్యాయం, లేని ఒక్కడికి ఒక న్యాయం. జగన్ కి అనేక సార్లు విన్నవించాం. జైల్ లో శ్రీను, విజయవాడ లో మేము ఆమరణ దీక్ష చేస్తున్నాం. NIA కూడా కుట్ర కోణాలు లేవని చెప్పింది. జగన్ కోర్ట్ కి వచ్చి సాక్ష్యం అయినా చెప్పండి. లేదా NOC అయినా ఇవ్వండని కోరుతున్నాం.
జైల్లో కోడికత్తి శ్రీను ఆమరణ నిరాహార దీక్ష..
124
previous post