ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలపై మావోయిస్టుల మెరుపుదాడి ఘటనలో విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టేకులగూడెం అటవీప్రాంతంలోని సీఆర్పీఎఫ్ బేస్‌క్యాంపు సమీపంలో మూడు రోజుల క్రితం భద్రతబలగాలపై చేసిన దాడిలో మావోయిస్టులు బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లను వినియోగించారు. అయితే వాటిని సొంతంగానే తయారు చేస్తున్నట్లు తేలడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. బీజీఎల్తోపాటు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లను సొంతంగానే కర్మాగారాల్లో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టేకులగూడెం అడవుల్లో దాడి అనంతరం మావోయిస్టుల సొరంగాన్ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతానికి సమీపంలోనే భారీగా ఆయుధాల డంప్‌ను భద్రతబలగాలు స్వాధీనం చేసుకోగా వీటిలో పదుల సంఖ్యలో బీజీఎల్‌లు లభించడం గమనార్హం. వాటి నిర్మాణశైలిని బట్టి మావోయిస్టులు సొంతంగానే తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దండకారణ్యంలోని అబూజ్మడ్ అడవుల్లో వీటిని తయారు చేస్తున్నట్లు భావిస్తున్నారు.
సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలపై మావోయిస్టుల మెరుపుదాడి…
70
previous post