127
మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహాజాతర నాలుగు రోజులుగా భక్త జనంతో పులకించింది. నాలుగు రోజులుగా కోటిన్నర మంది భక్తుల మొక్కులందుకున్న వన దేవతలు మహా జాతర ముగియడంతో జనం నుంచి వనంలోకి వెళ్లిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు. శనివారం సాయంత్రం గిరిజన పూజారులు ప్రత్యేక పూజల మధ్య వనప్రవేశం చేయించారు. ముందుగా గోవింద రాజు, పగిడిద్ద రాజులను స్వస్థలాలకు తీసుకెళ్లారు. తర్వాత సమ్మక్కను చిలకల గుట్టలో ఉన్న వనంలోకి, సారలమ్మను కన్నేపల్లికి తీసుకెళ్లారు. ఉద్విగ్నంగా సాగిన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు జాతర చివరి రోజు కూడా భక్తులు పోటెత్తారు. వనదేవతలు అడవికి చేరే సమయంలో వాన జల్లులు కురవడంతో భక్తుల ముఖంలో చిరునవ్వు వెల్లు విరిసింది.