అటవీ గ్రామాలలోని పాఠశాలల్లో విద్యార్థులు వచ్చినా సమయానికి ఉపాధ్యాయులు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాఠశాల భవనాలలోని తరగతి గదులలో టీచర్ల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతానికి అనుకుని ఉన్న తిప్పాపురం పంచాయతీలోని పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదు. స్కూల్ కి వచ్చి విద్యార్థులు తరగతి గదుల్లో కూర్చొని ఉపాధ్యాయుల రాక కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తిప్పాపురం పంచాయతీలోని కలిపాక, కొత్త గుంపు, తిప్పాపురం గ్రామంలోని పాఠశాలలో సమయ పాలన లేని ఉపాధ్యాయులు ఆలస్యంగా వస్తున్నారు. ఉపాధ్యాయుల పాఠశాలకు ఆలస్యంగా ప్రతిరోజు వస్తుండడంతో స్కూల్ కు వచ్చిన విద్యార్థులు ఆరుబయట ఆడుకోవడం, పాఠశాల దగ్గరలో ఉన్న చెట్లపైకి ఎక్కి ఆడుకుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి టీచర్లు రెండు మూడు గంటలు ఆలస్యంగా వస్తున్నారు. ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని సమయానికి ఉపాద్యాయులు పాఠశాలకు వచ్చేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రుల కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కుప్పం ఎయిర్పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..కుప్పం విమానాశ్రయ భూసేకరణకు మార్గం సుగమమైంది. 150 ఎకరాల సేకరణ నోటిఫికేషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తెలిపింది. భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై పలువురు సుప్రీం కోర్టులో…
- 15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..ఇక్కడ బాలికది సాధారణమైన గర్భంకాదు.. అత్యాచారం చేయబడి గర్భం దాల్చింది. తన గర్భంలో పెరుగుతున్నదీ..పెంచుతున్నదీ నిందితుడి ప్రతిరూపం..గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తే..తల్లీ బిడ్డల ప్రాణాలకు హాని జరుగొచ్చు..లేదా తల్లి క్షేమంగా ఉన్నా…బిడ్డ చనిపోతే…భ్రూణ హత్య ..అదీ సరికాదు…సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైనా సరే..…
- బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ గెలుస్తుందని స్పష్టం చేశారు. ‘మా-మాటి-మానుష్’ స్ఫూర్తితో టీఎంసీ ప్రభుత్వాన్ని తిరిగి…
- కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..బ్రహ్మంగారిమఠం వివాదం మళ్ళీ మొదలైంది. తాత్కాలిక పీఠాధిపతిగా నియామకమైన వెంకటాద్రి స్వామి పూర్వపు పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మారుతి మహాలక్ష్మి నివాసం ఉంటున్న గృహానికి గుర్తుతెలియని వ్యక్తులు…
- తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ నియామకం ..తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ బాధ్యతలు స్వీకరించడం పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులకు దారితీయనుంది. హైదరాబాద్లో జన్మించిన ఆనంద్ చిన్నప్పటి నుంచే ప్రతిభను చాటుకుని విద్యలో అగ్రగామిగా నిలిచారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువు కున్న సి వి ఆనంద్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 61689