Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Telangana సమయ పాలన లేని ఉపాధ్యాయులు

సమయ పాలన లేని ఉపాధ్యాయులు

by Satya
సమయ పాలన లేని ఉపాధ్యాయులు

అటవీ గ్రామాలలోని పాఠశాలల్లో విద్యార్థులు వచ్చినా సమయానికి ఉపాధ్యాయులు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాఠశాల భవనాలలోని తరగతి గదులలో టీచర్ల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతానికి అనుకుని ఉన్న తిప్పాపురం పంచాయతీలోని పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదు. స్కూల్ కి వచ్చి విద్యార్థులు తరగతి గదుల్లో కూర్చొని ఉపాధ్యాయుల రాక కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తిప్పాపురం పంచాయతీలోని కలిపాక, కొత్త గుంపు, తిప్పాపురం గ్రామంలోని పాఠశాలలో సమయ పాలన లేని ఉపాధ్యాయులు ఆలస్యంగా వస్తున్నారు. ఉపాధ్యాయుల పాఠశాలకు ఆలస్యంగా ప్రతిరోజు వస్తుండడంతో స్కూల్ కు వచ్చిన విద్యార్థులు ఆరుబయట ఆడుకోవడం, పాఠశాల దగ్గరలో ఉన్న చెట్లపైకి ఎక్కి ఆడుకుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి టీచర్లు రెండు మూడు గంటలు ఆలస్యంగా వస్తున్నారు. ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని సమయానికి ఉపాద్యాయులు పాఠశాలకు వచ్చేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రుల కోరుతున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన
    దేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి…
  • వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.
    రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని,…
  • ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..
    ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన…
  • చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.
    చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు.‘ఆపరేషన్ దేవ్’ పేరిట గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో భాగంగా తెలంగాణలో మురుగన్ అలియాస్ నాగరాజు గ్యాంగ్‌ను గుజరాత్ పోలీసులు…
  • ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..
    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

009325
Total views : 61472

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.