Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh తామే పోలవరంను పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాయుడు

తామే పోలవరంను పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాయుడు

by Satya
తామే పోలవరంను పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాయుడు

ప్రాజెక్టు నిర్మాణంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలోనే గాక పోలవరం మండలంలో నిర్వాసితులకు పరిహారాలు అందించడం, ఎన్నికల హామీగా ఇచ్చిన అదనపు పరిహారాలు ఇవ్వడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైంది. ప్రాజెక్టు ఎగువ నీటి నిల్వలు క్రమబద్ధీకరణ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం వల్ల, ప్రాజెక్టు దిగువన తగినన్ని జలాలు కరువయ్యాయి. నీటిమట్టం తక్కువ ఉండడం వలన ఉభయ గోదావరి జిల్లాల డెల్టాలకు తగినంత తాగునీరు, సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. గుత్తేదారుడైన మెగా సంస్థకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు బకాయి పడడం, బకాయిలు చెల్లించకపోవడం వలన పనులు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయనడంలో సందేహమే లేదు.
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం ఐదు వందల మంది కంటే కార్మికులు లేకపోవడం చూస్తే జాతీయ హోదా పొందిన ప్రాజెక్టుని వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజార్చిందో అర్థమవుతోంది. పోలవరం మా పాలనలోనే పూర్తి చేస్తామని డేట్లు ఇచ్చి రాసుకోమని చెప్పి ప్రగల్భాలు పలికిన జలవనరులశాఖా మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్, అంబటి రాంబాబులు పోలవరం వైపు చూసిన దాఖలాలే లేవు. జగన్ ఐతే తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో 5 సార్లు స్వయంగా వచ్చి ఆరోసారి విహంగ వీక్షణం చేశారే తప్ప పోలవరం ప్రాజెక్టు గురించి ఒక్క ఊసు కూడా చెప్పిన దాఖలాలే లేవు .తామే పోలవరంను పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాయుడు

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..
    యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్‌లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలోని పవిత్ర జలాలకు పూజలు చేశారు.పంచామృతం,…
  • కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..
    కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది.ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని టీడీపీ ఇంచార్జి బి.టెక్ రవి విమర్శించారు.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పులివెందుల పట్టణంలోని క్రిస్టియన్ వీధిలో పెన్షన్లు ఆయన…
  • అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..
    ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత. ఐతే అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు కొందరైతే..మరికొంత మంది సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు..ఈ నేపథ్యంలోనే…
  • కలగానే మిగిలిన సొంతింటి కల..
    పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో పేదల సొంతింటి కల ఇంకా అటకెక్కే ఉంది. గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం మండలం అడ్డాపుశిల, సాలూరు మున్సిపాలిటీ పరిధిలో భారీ ఎత్తున టిడ్కో ఇళ్లను నిర్మించారు. మొత్తం 1,983 మంది లబ్ధిదారులకు…
  • భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..
    కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై చమురు మార్కెటింగ్ సంస్థలు ఏకంగా రూ.993 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, గృహ వినియోగదారులకు ఊరట…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

009343
Total views : 61800

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.