ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం ఎజెండాగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ నుండి పాదయాత్ర మొదలుపెట్టి నియోజకవర్గంలోని ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యత మరియు మార్కాపురం జిల్లా ఆవశ్యకత గురించి వివరిస్తూ ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ పాదయాత్రలో కలిసి వచ్చే పార్టీలను అన్నింటిని కలుపుకొని ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల సమావేశం…
95
previous post