అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రోడ్డు రవాణా శాఖ భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి. జనవరి 14వ తేదీన ప్రారంభమైన రోడ్డు భద్రతా మాసోత్సవాలను.. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తాడిపత్రి రవాణాశాఖ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు RTO ఆఫీసులో ఆయన రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రారంభించారు. రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని.. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందన్నారు. ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి రాజా గోపాల్, ఆర్టీసీ డిపో మేనేజర్, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, ట్రైని డీఎస్పీ హేమంత్, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు రవాణా శాఖ భద్రత మాసోత్సవాలు…
102