బ్యూటీ విత్ టాలెంట్ అనే గుర్తింపు మలయాళ హీరోయిన్స్ కు ఉంది. వారి లెగసీని టాలీవుడ్ లో హీరోయిన్ సంయుక్తా మీనన్ కొనసాగిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ హీరోయిన్…ఐదు వరుస సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. భీమ్లా నాయక్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ సరసన బింబిసార, ధనుష్ తో కలిసి సార్, సాయి ధరమ్ తేజ్ జోడీగా విరూపాక్ష మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా కల్యాణ్ రామ్ డెవిల్ తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్ ఇలా సంయుక్తా చేసిన ప్రతి సినిమాలోనూ ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. చేసిన ప్రతి సినిమా సక్సెస్ కావడంతో సంయుక్తా ఉంటే సినిమాకు ఒక పాజిటివ్ వైబ్, క్రేజ్ ఉంటుందనే పేరు టాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోల్లో వచ్చేసింది. కంటిన్యూగా వస్తున్న సక్సెస్ తో సంయుక్తా మీనన్ కు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ దక్కుతున్నాయి. ప్రస్తుతం ఆమె నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభులో నాయికగా నటిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ తన ప్రతిభను గుర్తించి అందిస్తున్న అవకాశాలు, ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానం ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తున్నాయని సంయుక్తా మీనన్ చెబుతోంది. మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ తో నటిగా పేరు తెచ్చుకోవాలనుందని అంటోంది.
టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారిన సంయుక్తా మీనన్…
71