వైసిపి అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు (Simhadri Ramesh Babu), మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర రావు గెలుపే దిశగా ఫ్రతిరోజు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తు పైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు స్వతహాగా ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈరోజు అవనిగడ్డ వైసీపీ పార్టీ కార్యలయం నుంచి పలు గ్రామాల మీదుగా కోడూరు వరకు సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. వైసీపీకి మద్దతుగా వేలాదిగా వైసీపీ శ్రేణులు సింహాద్రి రమేష్ బాబు విజయం కోరుతూ ఉత్సాహంగా రోడ్ షో లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కు దారి పొడవునా మహిళలు హారతులతో స్వాగతం పలికారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ… నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలందరికీ సంక్షేమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మళ్లీ రాష్ట్ర ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. రేపు జరగబోయే ఎన్నికలలో నియోజకవర్గ ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అవనిగడ్డ శాసనసభ్యునిగా తనని మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…