రాజకీయ నాయకులంటేనే పదిమందికి న్యాయం చేసే నాయకులని మనం ఎంతో మందిని చూసి ఉంటాం. అయితే అందుకు భిన్నంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరులో ఓ స్థానిక వైసిపి నాయకుడు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. అధికారం ఉంది కదా అని.. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ… ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ పాగా వేసి ఆక్రమిస్తున్నాడు. గత 40 సంవత్సరాలుగా దుత్తలూరు పట్టణం కరెంట్ ఆఫీస్ వెనుక చిన్న పాక నిర్మించుకొని బతుకుతున్న తమను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనికరించమని కాళ్లు మొక్కుతున్నా.. దయచూపడం లేదని వాపోతున్నారు. గతంలో కూడా ఇదే నాయకుడు తమ మీద దాడి కూడా చేశాడని కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే… సదరు నాయకుడికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కూలికి వెళితే తప్ప డొక్కాడని తమ మీద ప్రతాపం చూపిస్తున్న వైసిపి నాయకుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిస్తున్న వైసిపి నాయకుడు
80
previous post