ఇదేమి రాజ్యం నీళ్లు లేని రాజ్యం…

rastharoko sitting on the main road

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ వాసులు త్రాగునీటి కోసం ఆర్డీటీ ఆసుపత్రికి ఎదురుగా ప్రధాన రహదారి పై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు&period; త్రాగునీటి కోసం కాళీ బిందెలతో మహిళలు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు&period; ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదేమి రాజ్యం నీళ్లు లేని రాజ్యం అంటూ మహిళలు నినాదాలు చేశారు&period; వారు మాట్లాడుతూ&period;&period; గొంతులోకి గుక్కెడు నీరు అందక రోడ్డెక్కామని ఏమి సీఎం అని ఇదేమి రాజ్యమని సీఎం పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; నెల రోజులుగా త్రాగునీటి కోసం అల్లాడుతున్నామన్నారు&period; ఉప్పు నీటి కోసం రెండు కిలోమీటర్లు వెళ్లి తెచుకుంటున్నామని మండిపడ్డారు&period; సమ్మె లో ఉన్న శ్రీరామిరెడ్డి కార్మికులకు జీతాలు ఇస్తేనే కదా నీళ్లు విడిచేది ఇలా చేస్తే ఎలా అని ప్రభుత్వాన్ని కాలనీ వాసులు నిలదీశారు&period; కనీసం మా కౌన్సిలర్ కాలనీ వైపు తొంగి కూడా చూడలేదు&period; కౌన్సిలర్ పరారీ అయ్యాడని మహిళలు మండిపడ్డారు&period; మున్సిపల్ అధికారులు పట్టించుకోరు&period; ఎన్నికల వేల ఓట్లు కోసం వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమయ్యారని వైసీపీ నాయకులను దుయ్యబట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్