58
జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలిగొంది. డివైడర్‌ను ఢీ కొట్టి కారు పల్టీలు కొట్టగా ముగ్గురు మృతి చెందారు. గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో కారు రోడ్ డివైడర్‌ను ఢీకొట్టడంతో కార్ పల్టికొట్టింది. కారులో ఉన్న ఆరుగురు లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గద్వాలలోని ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై గద్వాల నుండి పెబ్బేరుకు వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతులు నరేష్ పవన్ కుమార్, ఆంజనేయులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా కారులో వున్న మరో ముగ్గురు గోవర్ధన్ నవీన్ మహబూబ్ లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.