తిరుపతి ఎంపీపై అనర్హత వేటు వేయాలి…

Nallari Kishore Kumar Reddy

Advertisements

&NewLine;<p>దొంగ ఓట్లతో గెలుపొందిన తిరుపతి వైకాపా ఎంపీ గురుమూర్తిపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు&period; తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆలస్యంగానైనా కఠిన చర్యలు తీసుకోవడం స్వాగతిస్తున్నామన్నారు&period; అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా ఇతర కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేయడం ఇతర అధికారులకు హెచ్చరిక లాంటిదని గుర్తు చేశారు&period; ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దొంగ ఓటర్ కార్డులు సృష్టించి తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు వేయడం జగన్ ఆటవిక పాలనకు నిదర్శనమన్నారు&period; దొంగ ఎపిక్ కార్డులు తయారు చేయడంలో భాగస్వామ్యులైన మంత్రి పెద్దిరెడ్డి&comma; ఎంపీ మిథున్&comma; ఇతర వైకాపా ఎమ్మెల్యేలు భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period; శ్రీవారి భక్తుల ముసుగులో దొంగ ఓట్లు వేయడానికి వేలాది మందిని వాహనాల్లో తరలించి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని పేర్కొన్నారు&period; తాము మొదటి నుంచి ఆరోపిస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకు స్పందించి కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు&period; ఒకప్పుడు నిజాయితీ ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న గిరీషా అధికార పార్టీ నేతల వత్తిల్లకు తలొగ్గడం వల్లే సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు&period; ఇప్పటికైనా జగన్ భజన చేస్తున్న పలువురు ఐఏఎస్&comma; ఐపీఎస్ అధికారులు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను తూచా తప్పక పాటించి ఎన్నికలను నిస్వార్ధంగా జరిపించాలని డిమాండ్ చేశారు&period; ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని&comma; తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు&period; ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్లారపు రవి ప్రకాష్ నాయుడు ఇతర నేతలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్