అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ వాసులు త్రాగునీటి కోసం ఆర్డీటీ ఆసుపత్రికి ఎదురుగా ప్రధాన రహదారి పై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. త్రాగునీటి కోసం కాళీ బిందెలతో మహిళలు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదేమి రాజ్యం నీళ్లు లేని రాజ్యం అంటూ మహిళలు నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ.. గొంతులోకి గుక్కెడు నీరు అందక రోడ్డెక్కామని ఏమి సీఎం అని ఇదేమి రాజ్యమని సీఎం పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా త్రాగునీటి కోసం అల్లాడుతున్నామన్నారు. ఉప్పు నీటి కోసం రెండు కిలోమీటర్లు వెళ్లి తెచుకుంటున్నామని మండిపడ్డారు. సమ్మె లో ఉన్న శ్రీరామిరెడ్డి కార్మికులకు జీతాలు ఇస్తేనే కదా నీళ్లు విడిచేది ఇలా చేస్తే ఎలా అని ప్రభుత్వాన్ని కాలనీ వాసులు నిలదీశారు. కనీసం మా కౌన్సిలర్ కాలనీ వైపు తొంగి కూడా చూడలేదు. కౌన్సిలర్ పరారీ అయ్యాడని మహిళలు మండిపడ్డారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోరు. ఎన్నికల వేల ఓట్లు కోసం వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమయ్యారని వైసీపీ నాయకులను దుయ్యబట్టారు.
ఇదేమి రాజ్యం నీళ్లు లేని రాజ్యం…
79
previous post