జనసేన పిఠాపురం (AP Politics) సీటు కోసం చీప్ పాలిటిక్స్ మొదలుపెట్టిన నేతలు బొక్క బోర్లా పడుతున్నారు. ఎవరినో టార్గెట్ చేసి తికమకపడుతున్నారు. చివరకు హత్యాయత్నం కేసులో ఏకంగా దళిత యువతను సమిధిలు చేయడంపై దళిత వర్గాల నుండి తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతోంది. పిఠాపురం జనసేన కార్యాలయం వద్ద జనసేన నేతపై జరిగిన దాడి ఫేక్ అని పోలీసులు తేల్చేయడంతో తమపై దాడి జరిగిందని చెప్పిన జనసేన నాయకులు ముక్కున వేలుసుకోవాల్సి వచ్చింది. మొత్తంగా ఇప్పుడు జనసేన పిఠాపురం ఇన్‌ఛార్జి తంగెళ్ల మెడకు ఈ వివాదం చుట్టుకోవడంతో ఆ పార్టీ నేతలకు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు.
పిఠాపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న జనసేన పార్టీ కార్యాలయం ఎదుట జనసేన సీనియర్ నాయకుడిగా చెబుతున్న మాదేపల్లి శ్రీనివాస్ పై నలుగురు యువకులు కత్తులతో దాడులకు పాల్పడబోయారని, కావాలని జనసేన నాయకుల్ని టార్గెట్ చేసి, జనసేనను తొక్కేయాలని చూస్తున్నారంటూ ప్రెస్ మీట్ పెట్టి వారి ఆవేదన వ్యక్తం చేసారు. ఆతర్వాత లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి, రెక్కి నిర్వహించి కత్తులతో దాడులకు పాల్పడబోయిన వ్యక్తులను విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో జనసేన నేతలపై హత్యాయత్నం అంటూ పలు పత్రికల్లో, టీవీల్లో వార్తొలచ్చాయి. అయితే సీసీ కెమెరాల ద్వారా ఆరా తీసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు. సదరు యువకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. సీసీ కెమెరాల్లో గమనించిన దాని ప్రకారం యువకులు ఎటువంటి దాడులకు పాల్పడలేదని, కేవలం వారు పెయింటింగ్ వర్క్ చేయడానికి అక్కడకు వచ్చారని విచారణలో పోలీసులు తేల్చారు.
దీనిపై దళిత యువకులు, వారి కుటుంబ సభ్యులు అసలేం జరగనిదానికి తమను ఎందుకు విచారిస్తున్నారని పోలీస్ స్టేషన్ వద్దే ఉండిపోయారు. కావాలనే మాదేపల్లి శ్రీనివాస్ తమపై అబండాలు వేసారని, తమను నవ్వుతూ పలకరించి, తమపై కేసు ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదన్నారు. తాము గోడలకు పేయింట్ వేసేటప్పుడు, గోడల వద్ద తుప్పలు కొట్టేందుకు పరికరాలు తీసుకొచ్చామని, వాటిలో తుప్పలు కొట్టే కత్తులు కూడా ఉన్నాయని, శ్రీనివాస్ రావు తమను అన్ని విధాలుగా ఆరాతీసారని, కనీసం తమ మధ్య వివాదస్పదమైన మాటలు కూడా జరగలేదని వాపోయారు. ఎవరిపైనో దుష్ప్రచారం చేయడానికి తమను బాధ్యులు చేసి, కేసుల్లో ఇరికించడం ఎంత వరకూ సమంజసమన్నారు. తమను సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా చెడుగా చూపించిన మాదేపల్లి శ్రీనివాస్‌తోపాటు, పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జి ఉదయ్ శ్రీనివాస్ పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
AP Politics: దళితులంటే జనసేన కు లోకువా.. ? పండు అశోక్‌కుమార్..
పిఠాపురంలో అమాయక దళితులపై హత్యాయత్నం ఆరోపణలు చేసి, దళిత యువతపై కేసులు పెట్టాలని జనసేన నాయకులు ప్రయత్నించడం ఎంత వరకూ సమంజసమని పీవీ రావు మాలమహానాడు జాతీయ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ ప్రశ్నించారు. కూలీ పనికోసం వెళ్లిన దళిత యువకులపై పిఠాపురం జనసేన నాయకులు హత్యాయత్నం కేసు పెట్టడం దారుణమన్నారు. సీసీ కెమెరాల్లో పరిశీలించిన పోలీసులు అక్కడేం జరగలేదని తేల్చారని, ఇప్పుడు జనసేన నాయకులు ఏం సమాధానం చెబుతారని అశోక్ మండిపడ్డారు. దళితులంటే జనసేనకు లోకువా అని ఆయన ప్రశ్నించారు. మీ కుట్ర రాజకీయాల్లో దళితులను లాగితే ఊరుకోబోమని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఇటువంటి నేతలను పక్కన పెట్టుకోవడం సరికాదని హితవు పలికారు. దళిత యువకులకు క్షమాపణ చెప్పి, పెట్టిన కేసు తప్పు అని చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు..
Read Also: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Lorry – Bike Accident..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.