అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా కూకట్ పల్లి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ టెంపుల్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రావణి తెలిపారు. ఈ నెల 22 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదర్ నగర్ లోని మైసమ్మ దేవాలయం నుండి ఊరేగింపుగా శోభయాత్ర ప్రారంభమై నిజాంపేట్ చౌరస్తా, జె ఎన్ టి యూ, వివేకానంద నగర్, క్రొమో షో రూమ్ మీదగా మెట్రో షాపింగ్ మాల్ సమీపంలోని హుడా పార్కింగ్ దగ్గర శోభయాత్ర ముగుస్తుందని, శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు మరియు హనుమంతుడు రథని అధిరోహించగా శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ రథయాత్రను పురస్కరించుకొని ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోఆర్డినేటర్ శ్రావణి మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం మన దేశ చరిత్రలో కొత్త శకానికి నాంది అని, ఇది మన వైదిక సంస్కృతి అన్నారు. ఈ రథయాత్రలో వేలాదిమంది వైష్ణవ భక్తులు పాల్గొని సంప్రదాయ నృత్యాలు చేస్తూ, భక్త బృందాలచే శ్రావణమైన కీర్తనలు ఆలపిస్తూ రథయాత్ర సాగుతుందని తెలిపారు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో అయోధ్యలో మెగా అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు 30 వేల మందికి పైగా సాధువులకు నెల రోజులు ఉచిత అన్న ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు.
ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శోభాయాత్ర…
73