ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శోభాయాత్ర…

Coordinator Shravani in the media conference

Advertisements

&NewLine;<p>అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా కూకట్ పల్లి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ టెంపుల్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రావణి తెలిపారు&period; ఈ నెల 22 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదర్ నగర్ లోని మైసమ్మ దేవాలయం నుండి ఊరేగింపుగా శోభయాత్ర ప్రారంభమై నిజాంపేట్ చౌరస్తా&comma; జె ఎన్ టి యూ&comma; వివేకానంద నగర్&comma; క్రొమో షో రూమ్ మీదగా మెట్రో షాపింగ్ మాల్ సమీపంలోని హుడా పార్కింగ్ దగ్గర శోభయాత్ర ముగుస్తుందని&comma; శ్రీరాముడు&comma; సీతా&comma; లక్ష్మణుడు మరియు హనుమంతుడు రథని అధిరోహించగా శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు&period; ఈ రథయాత్రను పురస్కరించుకొని ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోఆర్డినేటర్ శ్రావణి మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం మన దేశ చరిత్రలో కొత్త శకానికి నాంది అని&comma; ఇది మన వైదిక సంస్కృతి అన్నారు&period; ఈ రథయాత్రలో వేలాదిమంది వైష్ణవ భక్తులు పాల్గొని సంప్రదాయ నృత్యాలు చేస్తూ&comma; భక్త బృందాలచే శ్రావణమైన కీర్తనలు ఆలపిస్తూ రథయాత్ర సాగుతుందని తెలిపారు&period; ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో అయోధ్యలో మెగా అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని&comma; ప్రతిరోజు 30 వేల మందికి పైగా సాధువులకు నెల రోజులు ఉచిత అన్న ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్